ధవళేశ్వరం బ్యారేజీ నుండి 7 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

ధవళేశ్వరం బ్యారేజీ నుండి 7 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

 వర్షాలకు పొంగుతున్న గోదావరి

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.30 అడుగులు

తూర్పు గోదావరి జిల్లాకు 10 వేల 500 క్యూసెక్కులు విడుదల

రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా గోదావరి నది పొంగుతోంది. ఎగువ నుండి వస్తున్న వరదకు తోడు స్థానికంగా భారీ వర్షాలు తోడవడంతో.. గోదావరి నదిలో వరద అంతకంతకూ పెరుగుతోంది. రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కి వరద పోటెత్తడంతో బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేశారు. బ్యారేజ్ నీటి మట్టం 9.30 అడుగులు మెయిన్ టెయిన్ చేస్తూ.. ఏడు లక్షల 10 వేల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నిన్న నాలుగు లక్షల  క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసిన అధికారులు వరద పోటెత్తడంతో నీటి విడుదలను పెంచారు. ఈ సీజన్ లో ఇంత భారీగా సముద్రంలోకి నీటిని వదిలివేయడం తొలిసారి. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు 10 వేల 500 క్యూసెక్కుల సాగు నీరు విడుదల కొనసాగుతోంది.