కలశ ఫైన్ జ్యుయెల్స్‌‌‌‌‌‌‌‌లో ..7 వారాల నగల కలెక్షన్‌‌‌‌‌‌‌‌

కలశ ఫైన్ జ్యుయెల్స్‌‌‌‌‌‌‌‌లో ..7 వారాల నగల కలెక్షన్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  కలశ ఫైన్ జ్యుయెల్స్‌‌‌‌‌‌‌‌   ‘ఏడు వారాల నగలు’ పేరుతో తమ లేటెస్ట్ కలెక్షన్‌‌‌‌‌‌‌‌ను ప్రదర్శనకు ఉంచింది. శుక్రవారం  నుంచి ఈ నెల 25 వరకు  బంజారాహిల్స్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇవి ప్రదర్శనకు ఉంటాయి. సినీ నటి  ముచ్చెర్ల అరుణ ఈ యానివర్సరీ కలెక్షన్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం లాంచ్ చేశారు. ఏడో యానివర్సరీ సందర్భంగా కలశ ఫైన్‌‌‌‌‌‌‌‌ జ్యువెల్స్ వివిధ ఆఫర్లను ప్రకటించింది. స్వర్ణకలశం సేవింగ్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటే మొదటి ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో 50 శాతం ఆఫర్ ఇస్తోంది. క్యారెట్ డైమండ్‌‌‌‌‌‌‌‌ను (వీవీఎస్​ఈఎఫ్​)  రూ.55,900 కి అమ్ముతోంది. రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన కొనుగోలుపై ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది.