
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: స్టూడెంట్సూసైడ్కు కారణమైన యువకుడికి ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం అడిషనల్సెషన్స్జడ్జి శ్రీనివాస్తీర్పు చెప్పారు. వెంకటాపురం మండలం నీలార్పేటకు చెందిన స్రవంతి వెంకటాపురంలో డిగ్రీ ఫైనలియర్చదువుతోంది. 2015 జనవరి 17న ఫీజు కట్టేందుకు తల్లి దమయంతి వద్ద డబ్బులు తీసుకుని కాలేజీకి వెళ్లింది. దారిలో ఆమెను వీరాపురం గ్రామానికి చెందిన కుమ్మరి రామకృష్ణ అడ్డుకున్నాడు. తనను ప్రేమించాలని వేధిస్తూ సెల్ఫోన్లాక్కున్నాడు. నీకు ఎవరితో సంబంధం ఉందో చెప్పు అంటూ కొట్టాడు. తనను పెండ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి వచ్చి పురుగుల మందు తాగింది. ట్రీట్మెంట్తీసుకుంటూ చనిపోయింది. స్రవంతి తల్లి వెంకటాపురం పీఎస్లో కంప్లైట్ఇవ్వగా సాక్షుల విచారణ తర్వాత రామకృష్ణకు ఏడేండ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి ఫైన్ విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.