ఇరిగేషన్‌‌లో 70%  పోస్టులకు డైరెక్ట్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌!

ఇరిగేషన్‌‌లో 70%  పోస్టులకు డైరెక్ట్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌!
  • రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్‌‌, వెలుగు: ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో 70% పోస్టులు డైరెక్ట్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోనల్‌‌ వ్యవస్థకు అనుగుణంగా సర్వీస్‌‌ రూల్స్‌‌ను సవరించింది. అసిస్టెంట్‌‌ ఇంజనీర్‌‌, టెక్నికల్‌‌ ఆఫీసర్‌‌, అసిస్టెంట్‌‌ టెక్నికల్‌‌ ఆఫీసర్‌‌, జాయింట్‌‌ టెక్నికల్‌‌ ఆఫీసర్‌‌, టెక్నికల్‌‌ అసిస్టెంట్‌‌ పోస్టుల రిక్రూట్‌‌మెంట్‌‌ విధానాన్ని ప్రకటించింది. 30% పోస్టులు ప్రమోషన్‌‌ల ద్వారా భర్తీ చేస్తామని పేర్కొంది. సంబంధిత కేడర్‌‌లో మూడేండ్ల సర్వీస్‌‌ పూర్తయిన వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్పింది. అసిస్టెంట్‌‌ ఇంజనీర్‌‌, టెక్నికల్‌‌ ఆఫీసర్‌‌ పోస్టులను మల్టీ జోనల్‌‌గా ఇతర పోస్టులను జోనల్‌‌ పోస్టులుగా పేర్కొంది. రిక్రూట్‌‌మెంట్‌‌ అథారిటీగా ఈఎన్సీ (అడ్మిన్‌‌) వ్యవహరిస్తారని తెలిపింది.