సూర్యాపేట జిల్లాలో రెండు మిల్లుల్లో రూ. 73 కోట్ల ధాన్యం మాయం

సూర్యాపేట జిల్లాలో రెండు మిల్లుల్లో రూ. 73 కోట్ల ధాన్యం మాయం

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని మిల్లు యజమానులు పక్కదారి పట్టించారు. సూర్యాపేట జిల్లా బాలెంల పరిధిలోని రెండు రైస్ మిల్లుల్లో ఆఫీసర్లు జరిపిన తనిఖీల్లో సుమారు రూ.73 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు తేలింది. నల్గొండ జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ అధికారులు, సూర్యాపేట సివిల్ సప్లయ్ ఆఫీసర్లు సంయుక్తంగా ఈ నెల 20న బాలెంల శివారులోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్ పై దాడులు చేశారు. 

వజ్ర వికాస్ రైస్ మార్ట్ నుంచి ఎఫ్ సీఐకి పంపాల్సిన బియ్యాన్ని ముదిగొండలోని సత్యసాయి రైస్ కార్పొరేషన్ పేరుతో అక్రమంగా తరలిస్తుండగా లారీలను నిలిపివేసి, స్టాక్ ను స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి, నిల్వలకు పొంతన లేదని గుర్తించారు. 

రెండు మిల్లుల్లో మొత్తం 29,187.888 టన్నుల వడ్లు మాయమైనట్లు నిర్ధారించారు. మిల్లుల్లో ఉన్న నిల్వలను సీజ్ చేసి ఇతర మిల్లులకు తరలించాలని సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్‌‌‌‌‌‌‌‌కు ఆదేశాలు జారీ చేశారు. వట్టె జానయ్య, రేణుక, గణేశ్ పై కేసు నమోదు చేశారు.