స్వతంత్ర భరద్వాజ్‌‌‌‌‌‌‌‌పై పోక్సో కేసు..పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు

స్వతంత్ర భరద్వాజ్‌‌‌‌‌‌‌‌పై పోక్సో కేసు..పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: హిందుత్వ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌‌‌‌‌‌‌‌పై ఢిల్లీ పోలీసులు పోక్సో యాక్ట్ కింద ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమోదు చేశారు. న్యాయ నిపుణుల సలహా మేరకు స్టాకింగ్, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడటం వంటి అభియోగాలతో పాటు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాల కింద కేసులు నమోదు చేశారు. 

కాగా, భరద్వాజ్ ను మరో రోజు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళన సందర్భంగా మైనర్ కార్యకర్త తండ్రిపై దాడి జరిగింది. 

ఈ దాడికి పాల్పడిందని తానేనని స్వతంత్ర భరద్వాజ్ ఓ వీడియో పాడ్‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌లో వెల్లడించాడు. తనకున్న రాజకీయ పరిచయాలతో అరెస్టు నుంచి తప్పించుకున్నానని గొప్పలు చెప్పుకున్నాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు యూపీలోని బులంద్ షహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.