తెలంగాణ హైకోర్టు స్పెషల్ లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌లో 74,782 కేసులు పరిష్కారం

 తెలంగాణ హైకోర్టు స్పెషల్ లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌లో 74,782  కేసులు పరిష్కారం
  • హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికం సాల్వ్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ హైకోర్టు, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 74,782 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ చేయదగిన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ కేసులు 14,642, పెట్టీ కేసులు 23,400, మోటార్ వెహికల్ చట్టం కింది కేసులు 31,189, సైబర్ క్రైం కేసులు 5,397, డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ యాక్ట్ కింది 154 కేసులను లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేశారు. 

సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. యూనిట్ల వారీగా చూస్తే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 11,226 కేసులు పరిష్కారమయ్యాయి. ఆ తర్వాత రామగుండం (8,108), నల్లగొండ (6,410), ఖమ్మం (6,090), వరంగల్ (5,064) కేసులు సెటిల్ అయ్యాయి. 

తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా జడ్జిలు, మేజిస్ట్రేట్లు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారుల సమన్వయంతోనే ఇంత పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయని చారుసిన్హా పేర్కొన్నారు.