ఈ ఏడాది చివరి నాటికి 75వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు: కేటీఆర్

ఈ ఏడాది చివరి నాటికి 75వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు: కేటీఆర్

ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 75 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌.  మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన పనులను ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. ప్రతి నియోజకవర్గంలో వైకుంఠధామాల ఏర్పాటు, చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. లాక్ డౌన్‌ సమయాన్ని చక్కగా వినియోగించుకుని జీహెచ్‌ఎంసీ రోడ్ల లేయింగ్‌, నిర్మాణ పనులను పూర్తి చేశామని తెలిపారు. ఈ విషయంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న శానిటేషన్‌ పనులు, జలమండలి సివరేజ్‌ నిర్వహణపై మంత్రి కేటీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.