
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 854764కు చేరిందని చెప్పింది. వైరస్ తో గడిచిన 24 గంటల్లో 13 మంది చనిపోయారని తెలిపింది. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 6881కు చేరిందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని 1507 మంది డిశ్చార్జ్ అయ్యారని.. ఏపీలో ఇప్పటివరకు 829991 మంది డిశ్చార్జ్ అయ్యారంది. రాష్ట్రంలో ప్రస్తుతం 17892 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు ఏపీలో 91,97,307 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.