పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే సంబరాలు

పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే సంబరాలు

సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్స్లో రిపబ్లిక్ డే  వేడుకలు ఘనంగా జరిగాయి.  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ  జాతీయ జెండా ఎగురవేశారు.  ఈ వేడుకల్లో    డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అంతకు ముందు గవర్నర్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళి అర్పించారు.

 జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కాసేపట్లో గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు గవర్నర్ అవార్డ్స్ ప్రదానం చేయనున్నారు.

సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.