హైదరాబాద్ జూ పార్కులో 8 సింహాలకు కరోనా!

హైదరాబాద్ జూ పార్కులో 8 సింహాలకు కరోనా!

హైదరాబాద్: కరోనాతో దేశం మొత్తం అల్లాడుతోంది. రాష్ట్రంలోనూ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ సమయంలో మనుషులకే కాదు.. జంతువుల్లోనూ కరోనా లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది. అది కూడా ఒకేసారి 8 సింహాలకు కరోనా సోకిందన్న వార్త హాట్ టాపిక్‌‌గా మారింది. వివరాలు.. నగరంలోని నెహ్రూ జూపార్క్‌‌లో ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు. ఈ సింహాలకు నిర్వహించిన ఆర్‌టీ పీసీఆర్ టెస్టుల్లో వైరస్ పాజిటివ్‌గా వచ్చిందని జూపార్క్ అధికారులకు సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని జూపార్క్ డైరెక్టర్ డాక్టర్ సిద్ధానంద్ కుక్రేటి ఖండించకపోవడం గమనార్హం. ‘సింహాలకు కరోనా లక్షణాలు ఉన్న మాట వాస్తవమే. కానీ సీసీఎంబీ నుంచి మాకు అందాల్సిన ఆర్టీ పీరీఆర్ రిపోర్టులు ఇంకా రాలేదు. కాబట్టి ఈ విషయంపై ఇప్పుడే కామెంట్ చేయలేను. సింహాలు ఇప్పుడు బాగానే ఉన్నాయి’ అని డాక్టర్ కుక్రేుటి చెప్పారు. కాగా, ఆదివారం నుంచి జూ పార్కులో సందర్శకులకు అధికారులు అనుమతి నిరాకరించారు.