హైదరాబాద్ లో కల్తీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. కాసుల కక్కుర్తి కోసం నకిలీ పదార్థాలను మార్కెట్లోకి వదులుతున్నాయి.తాజాగా హైదరాబాద్ సిటీలో కల్తీ పన్నీరు అమ్ముతున్న ఒక ముఠా గుట్టును H-FAST (హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్) పోలీసులు రట్టు చేశారు.
గత కొన్ని రోజులుగా సిటీలోని పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు.. నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా 800 కేజీల కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకున్నారు.రసాయనాలు, నాణ్యత లేని పదార్థాలతో ఈ పన్నీరును తయారు చేసి, నగరంలోని ప్రముఖ హోటళ్లు, డెయిరీ ఫామ్‌లు, మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి కల్తీ ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని H-FAST పోలీసులు హెచ్చరిస్తున్నారు. పన్నీరు కొనేముందు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
