- కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్పరిధిలోని సర్వే నంబర్ 157/1లో గల 8 ఎకరాల ప్రభుత్వ భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రైవేట్వ్యక్తులకు ధారాదత్తం చేసిందని ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఆరోపించారు. బుధవారం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన జరిగిన కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2023 జూన్‌లో స్వయంగా కేటీఆర్ రూ.50 కోట్లు లంచం తీసుకొని ఆ భూమిని ప్రైవేట్వ్యక్తులకు అప్పగించారన్నారు. సంబంధిత సీసీఎల్ఏ కాపీని చూపెట్టారు.
ఆ భూమిలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని తాను భావిస్తున్నానని, అందుకే అక్కడ ప్రైవేట్నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తప్పులు బీఆర్ఎస్ నాయకులు చేసి, ఆ నిందను కాంగ్రెస్‌పై వేయడం తగదన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల ద్వారా బోర్డుకు సమకూరిన రూ.303 కోట్లతో నాలాలు, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించాలని అధికారులకు సూచించారు.
