జీ 7 వేదికపై మెలోడీ సందడి.. మనమే అత్యంత పాపులర్ కపుల్..మోదీతో మెలోని సరదా సంభాషణ

జీ 7 వేదికపై మెలోడీ సందడి.. మనమే అత్యంత పాపులర్ కపుల్..మోదీతో మెలోని సరదా సంభాషణ

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సోషల్​మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న ‘మెలోడీ’ హంగామా అంతర్జాతీయ వేదికపై మరోసారి సందడి చేసింది. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌లోని ఎవియన్-లెస్-బైన్స్ వేదికగా మంగళవారం జరిగిన జీ 7 సదస్సులో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌‌‌‌‌‌‌‌గా మారింది.

 ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌కు మద్దతు, అమెరికా–ఇరాన్ ఒప్పందంలాంటి కీలక ప్రపంచ పరిణామాలపై చర్చించేందుకు జీ7 దేశాల నేతలు ఇక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రూప్ ఫొటో దిగడానికి ముందు ప్రధాని మోదీ, జార్జియా మెలోని ఒకరినొకరు పలకరించుకుంటూ కరచాలనం చేసుకున్నారు. అక్కడే ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర ప్రపంచ దేశాల నేతల సమక్షంలో ఈ ఇద్దరు నేతలు కాసేపు నవ్వుతూ ముచ్చటించారు. 

ఆ సమయంలో ఆడియో అంత స్పష్టంగా లేనప్పటికీ.. సోషల్ మీడియాలో తమపై వస్తున్న క్రేజ్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దీనికి ఇటలీ ప్రధాని మెలోని స్పందిస్తూ.. ‘‘అవును, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో మనమే అత్యంత పాపులర్ కపుల్!’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.