మృగం మనిషిగా పుడితే.. ఇంప్రెస్ చేస్తున్న రాంబో గ్లింప్స్

మృగం మనిషిగా పుడితే.. ఇంప్రెస్ చేస్తున్న రాంబో గ్లింప్స్

శ్రీతేజ్ హీరోగా రత్నాకరం అనిల్ రాజు తెరకెక్కిస్తున్న యాక్షన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘రాంబో’. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేశారు. ‘ఒక మృగం మనిషిగా పుడితే వాడే రాంబో’ అనే డైలాగ్‌‌‌‌తో మొదలైన గ్లింప్స్‌‌‌‌ వైల్డ్ యాక్షన్‌‌‌‌తో ఇంప్రెస్‌‌‌‌ చేసింది.

యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌లో అగ్రెసివ్‌‌‌‌ బాడీ లాంగ్వేజ్‌‌‌‌,  ఇంటెన్స్‌‌‌‌ యాక్టింగ్‌‌‌‌తో శ్రీతేజ్‌‌‌‌ ఆకట్టుకున్నాడు.  శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.

రాజీవ్ సాలూరి, ఫర్నాజ్ శెట్టి, మైమ్ గోపీ, ఎం.ఎస్.ఆర్. మధుసూధనరావు, నీలిమ పాఠకంశెట్టి, మీర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌‌‌‌వీకే సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై శ్రీధర్ గంగపట్నం  నిర్మిస్తున్నారు.