టీ9 చాలెంజ్ సీజన్-4: టాప్లో పార్‌‌‌‌‌‌‌‌ టైమర్స్

టీ9 చాలెంజ్ సీజన్-4: టాప్లో పార్‌‌‌‌‌‌‌‌ టైమర్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: టీ9 చాలెంజ్‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌–4 గోల్ఫ్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో పార్‌‌‌‌‌‌‌‌ టైమర్స్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది. మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో మూడున్నర పాయింట్లు సాధించిన టైమర్స్‌‌‌‌‌‌‌‌.. మొత్తం 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 

ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఒక్కసారి మాత్రమే ఓడింది. బంకర్‌‌‌‌‌‌‌‌ బస్టర్స్‌‌‌‌‌‌‌‌ జట్టు 7, విసాఫ్ట్‌‌‌‌‌‌‌‌ టైటాన్స్‌‌‌‌‌‌‌‌ 6 పాయింట్లతో వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. దాసోస్ బై మహి, శ్రీ మెట్రిక్స్ ఈగల్స్ చెరో 5 పాయింట్లతో, రాజపుష్ప ఇన్విక్టా 4 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.