‘శుభం’ ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందించిన చిత్రం ‘దీవాన’. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ చిత్రం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్.. మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుతూ ‘పరిచయం లేని అమ్మాయిని ఓ వ్యక్తి కలిసి ఆమెతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. ఈ లైన్‌లో ఎమోషనల్ ప్లస్ కమర్షియల్ కథ ఉందనిపించింది. ‘మెయిల్’ డైరెక్టర్ ఉదయ్ ద్వారా హర్షిత్ రెడ్డికి ఈ స్టోరీ వినిపించా. తనకు బాగా నచ్చింది. వాసు, శ్రీదేవిలను పరిచయం చేశాడు. అలా ఈ సినిమా మొదలైంది.
69 రోజుల్లో తీయాలని ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్‌ను 42 రోజుల్లో పూర్తి చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించినా రైటింగ్ పవర్, నటీనటుల వల్ల బాగా తీయగలిగాను. ఇది కొంచెం నైంటీస్ నాటి లవ్‌స్టోరీలా ఉంటుంది. ఇందులో ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్మెంట్ ఉంది. ప్రతి మనిషిని టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎమోషన్స్ బాగా నచ్చుతాయి. పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా సినిమా చూసిన ప్రేక్షకుడి రియాక్షన్ నాకు ఇంపార్టెంట్” అని చెప్పాడు.
