- ఓపెన్ ఎయిర్పార్టీ జోన్‌కు హెచ్ఎండీఏ సన్నాహాలు
- రూ.1.20 కోట్లతో నిర్మించేందుకు ప్లాన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: నెక్లెస్ రోడ్ సమీపంలో మరో ఈవెంట్ జోన్ ఏర్పాటుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్ లో భారీ ఎత్తున ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతంలో ఎన్టీఆర్గార్డెన్పక్కనే రాక్గార్డెన్ఏర్పాటుచేసి ఈవెంట్స్‌కు అద్దెలకు ఇచ్చారు. మంచి స్పందన వచ్చినా కొన్ని కారణాలతో అధికారులు తొలగించారు. తాజాగా ఐమ్యాక్స్‌కు ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్‌ను ఇప్పుడు పార్టీలకు, వివిధ రకాల ఈవెంట్లకు సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా ఓపెన్ఎయిర్పార్టీ జోన్‌గా తీర్చిదిద్దనున్నారు. నాలుగైదు నెలల్లోనే దీనిని పూర్తి చేసేందుకు ప్లాన్లు రూపొందించారు. ఎంగేజ్మెంట్, వెడ్డింగ్డిన్నర్లు, బర్త్‌డే వేడుకలు, పార్టీలు చేసుకునే వారికి అనువుగా ఉండేలా డిజైన్చేస్తున్నారు.
ఇక్కడే ఎందుకు?
ఐమ్యాక్స్ఎదురుగా హెచ్ఎండీఏకు ఉన్న ఆరెకరాల విస్తీర్ణంలో పార్కు ఉంది. ఇందులో రెండు కొలనులు కూడా ఉండడంతో ఉదయం, సాయంత్రం పెద్ద సంఖ్యలో వాకర్స్, సందర్శకులు వస్తుంటారు. హుస్సేన్సాగర్పరిసరాల్లో పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాల్లో లేక్‌వ్యూ పార్క్ కూడా ఒకటి. అందుకే ఇక్కడ ఓపెన్ఎయిర్పార్టీ జోన్ఏర్పాటు చేస్తే మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. పార్టీలకు ఫీజులు కూడా వసూలు చేయడం వల్ల ఆదాయం కూడా సమకూరుతుందంటున్నారు.
బిగ్ స్టేజ్, గ్రీన్ రూమ్స్
లేక్‌వ్యూ పార్కులో రూ.1.20 కోట్లతో ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్ నిర్మించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇందులో ఆకట్టుకునేలా పెద్ద స్టేజ్, గ్రీన్ రూమ్స్, టాయిలెట్స్, చుట్టూ బౌండరీ వాల్ నిర్మించనున్నారు. నిర్మాణం తర్వాత ఈ పార్టీ జోన్నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్వ్యక్తులకు ఇవ్వాలని అనుకుంటున్నారు.
