చార్మినార్: బీబీ- కా -ఆలం ఊరేగింపునకు ఏర్పాటు పూర్తి

చార్మినార్: బీబీ- కా -ఆలం ఊరేగింపునకు ఏర్పాటు పూర్తి
  •     మంత్రి అజారుద్దీన్ 
  •     దట్టీలు సమర్పించి, ప్రార్థనలు

చార్మినార్, వెలుగు: మొహర్రం ధర్మం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ప్రపంచమంతా స్మరించుకుంటుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. బుధవారం బీబీ కా అలావా(డబీర్​పురూ పరిసరాలు)ను దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత బస్తీలోని డబీర్​పురాలో మొహర్రం10వ రోజు(యాషూరా) బీబీ–కా–ఆలం ఊరేగింపు ప్రారంభమవుతుందని తెలిపారు. సంబంధిత ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు. 

అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆశిర్ఖానాలలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తూ పనులను చేయించాలని ఆదేశించారు. యాకుత్​పురా దర్వాజా ఆశిర్ఖానాలోని పీర్లను సందర్శించి, దట్టీలు సమర్పించారు. ఎమ్మెల్యే మీరాజ్ జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్​ఉల్ హసన్, ఎఫెండి, జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్​కమిషనర్ సత్యనారాయణ, మీర్​చౌక్​ ఏసీపీ శ్యాంసుందర్, రెయిన్​ బజార్​ ఇన్​స్పెక్టర్​ నేతాజీ తదితరులు పాల్గొన్నారు.