గంగాధర, వెలుగు: పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, చొప్పదండి నియోజకవర్గాన్ని రాష్ట్రానికి రోల్మోడల్‌గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట, నారాయణపూర్, లక్ష్మీదేవిపల్లిలో రూ.50 లక్షలతో మహిళా సంఘ భవనాల నిర్మాణానికి రూ.19.98 లక్షలతో సబ్ సెంటర్ భవన నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనంతరం బూరుగుపల్లిలో నిర్వహించిన వన మహోత్సవంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి 2 వేల ఈత మొక్కలు నాటారు. సింగల్ విండో చైర్మన్ తిర్మల్‌రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్, సర్పంచులు నగేశ్, కరుణాకర్, లింగయ్య, బాబలక్ష్మి పాల్గొన్నారు.
మ్యాడంపల్లి సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక
మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లి సర్పంచ్ అంజయ్య బుధవారం కాంగ్రెస్ లో చేరగా, ఎమ్మెల్యే సత్యం ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
