నీట్ పేపర్ లీక్ వివాదం..పరీక్ష రద్దు ,రీ-ఎగ్జామ్స్ (Re-Exam) భారంతో దేశవ్యాప్తంగా అభ్యర్థులు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా..తాజాగా తమిళనాడుకు చెందిన నీట్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడింది. కోయంబత్తూరు కు చెందిన అనుకీర్తన అనే 19 ఏళ్ల నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. రద్దయిన నీట్ ఎగ్జామ్ ను తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతుండగా.. రీఎగ్జామ్ భయంతో అనుకీర్తన బలవర్మరణానికి పాల్పడిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో కోయంబత్తూరులో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ 2026 పరీక్ష రద్దయినప్పటికీ నుంచి అభ్యర్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష చతుర్వేది అనే యువతి, రాజస్థాన్ కు చెందిన ప్రదీప్ మహిచ, ఉత్తరాఖండ్ కుచెందిన రియాకుమరి జూన్ 20న జరగాల్సిన నీట్ రీఎగ్జామ్ కు ముందు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నీట్ ఎగ్జామ్ రద్దు తర్వాత ఇది నాలుగో ఆత్మహత్య ఘటన.
ఇదిలా ఉంటే నీట్ పరీక్షపై మొదటినుంచి తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.. కేంద్ర ప్రభుత్వంనిర్వహించే ఈ ఎగ్జామ్ తో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వాదిస్తోంది.
ఖరీదైన ప్రైవేట్ కోచింగ్ లు భరించే సంపన్న కుటుంబాల విద్యార్థులకు ఈ ఎగ్జామ్ తో ప్రయోజనం చేకూరుందని ఆరోపిస్తోంది. 12 వ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చినప్పటికీ పేద, గ్రామీణ విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
నీట్ ఎంట్రన్స ఎగ్జామ్ కు ముందు తమిళనాడులో ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా 12 వతరగతి మార్కుల ఆధారంగా వైద్య విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేది. ఈ పాత విధానం ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్యను అందించిందని తమిళనాడు ప్రజలు, నేతలు చెబుతున్నారు.
