మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2026 జూన్ 18న కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు దుగ్గుదుగ్గయింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి మురహరిపల్లి లో జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం. హైదరాబాదు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కి అవతలి రోడ్డుపై వస్తున్న లారీని ఢీకొట్టడంతో రోడ్డు రక్తసిక్తం అయ్యింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
