మున్నూరు కాపు బిల్డింగ్కు రూ. 5 కోట్లు మంజూరు : మంత్రి పొన్నం ప్రభాకర్

మున్నూరు కాపు బిల్డింగ్కు రూ. 5 కోట్లు మంజూరు : మంత్రి పొన్నం ప్రభాకర్

రవీంద్రభారతి, వెలుగు: మున్నూరు కాపు భవన నిర్మాణానికి రూ.5. కోట్లు మంజూరు చేస్తున్నట్టు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెలలో ప్రొసీడింగ్స్ ఇచ్చి పనులు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. మున్నూరు కులానికి సంబంధించిన హక్కుల కోసం కొట్లాడతానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి మున్నూరు కాపులను ఐక్యం చేయాలని ఆ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి సూచించారు. సమావేశంలో మున్నూరు కాపు కార్పొరేషన్ వైస్ చైర్మన్‌‌గా భాస్కర్‌‌, మున్నూరు కాపు సం ఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తమరావు, కార్యక్రమ నిర్వాహకులు లక్ష్మణ్, పెద్ది పెంటయ్య, వెంకన్న, సత్యనారాయణ, రామారావు పాల్గొన్నారు.