మంత్రులకు స్పెషల్ ట్యాబ్స్ ..  ఇక నుంచి డిజిటల్ కేబినెట్  

మంత్రులకు స్పెషల్ ట్యాబ్స్ ..  ఇక నుంచి డిజిటల్ కేబినెట్  

తెలంగాణ పాలనలో మరో కీలక ముందడుగు పడింది.  ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పూర్తిగా  పేపర్ లెస్ గా జరగనున్నాయి. సీఎం  రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ఎవరూ లేకుండా కేవలం మంత్రులతో మాత్రమే సీఎం ప్రత్యేక భేటీ నిర్వహించారు.

ఈ డిజిటల్ కేబినెట్ విధానంలో భాగంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. సీఎంకు, డిప్యూటీ సీఎంకు, ఇతర మంత్రులకు ప్రత్యేకంగా రూపొందించిన టాబ్ లను అందజేశారు.

ఇక నుంచి కేబినెట్ ఎజెండా మొత్తం ఈ-బుక్ (e-Book) రూపంలోనే మంత్రుల ట్యాబ్స్‌లోకి చేరుతుంది. పేపర్ లెస్ గవర్నెన్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ నూతన విధానంపై ఇప్పటికే పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది.

నూతన డిజిటల్ కేబినెట్ పనితీరును స్వయంగా పరిశీలించిన  సీఎం రేవంత్ రెడ్డి, పారదర్శకమైన, వేగవంతమైన పాలన దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.