వచ్చే ఐపీఎల్ సీజన్ కాస్త ముందుగానే ప్రారంభం కానుంది. తొందరగా స్టార్ట్ చేసి తొందరగా ఎండ్ చేసేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దీంతో సమ్మర్ లో క్రికెట్ కిక్కు ఫ్యాన్స్ కు ఎర్లీగానే మొదలవనుంది. ఐపీఎల్ 2027 షెడ్యూల్ గురించి బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా కీలక విషయాలు వెల్లడించారు.
ఫ్యూచర్ ఎడిషన్‌లను మార్చి 10న ప్రారంభించి మే 15వ తేదీ నాటికి ముగించేందుకు బీసీసీఐ పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. సమ్మర్ కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ చివరి దశలో తీవ్రమైన ఎండలు ఉండటంతో మ్యాచ్ లను ముందుగానే ప్రారంభించే ప్లాన్ చేస్తున్నారు.
మే నెలాఖరులో ఎండలు తీవ్రంగా ఉండటం.. అలాగే ఐపీఎల్ రెండు నెలల గ్యాప్ లో ఇంటరనేషన్ క్రికెట్ క్యాలెండర్‌ను సర్దుబాటు చేయాలంటే సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది (2026) ఐపీఎల్ మార్చి 29 (28) తేదీలలో మొదలై, మే 31 నాటికి ముగిసింది. మే 15 తర్వాత టోర్నమెంట్ చివరి దశలో వర్షాలు కురిసే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చలు జరుపుతున్నాం. అటు తీవ్ర ఎండలు, ఇటు వర్షాల నుంచి తప్పించుకుని.. షెడ్యూల్ ను ముందుగానే ముగించాలని ప్లాన్ లో ఉన్నట్లు చెప్పారు.
- 74 నుంచి 94 పెంచడం కష్టమే..
లీగ్‌ను పెంచాలని సూచనలు వస్తున్నప్పటికీ, ఇంటర్నేషనల్ షెడ్యూలింగ్ పరిమితుల కారణంగా మ్యాచ్ లను పెంచడం కష్టమేనని అన్నారు. ఫ్యూచర్ లో మ్యాచ్‌ల సంఖ్యను 74 నుండి 94కు పెంచే అవకాశం లేదని స్పష్టం చేశారు.
