కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తమిళ దర్శకుడు రా. కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తుండగా, తాజాగా చిత్ర సంగీత దర్శకుడిపై కూడా అధికారిక ప్రకటన వచ్చింది. కింగ్ 100 మూవీకి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందిస్తున్నట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆగస్టు 2న DSP బర్త్ డే స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ క్రేజీ అప్‌డేట్‌ను వెల్లడించారు. దీంతో అక్కినేని అభిమానుల్లో సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది.
నాగార్జున సెంటిమెంట్ రిపీట్?
కింగ్ నాగార్జున తన 100వ మైలురాయి చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని కన్ఫామ్ అయిపొయింది. గతంలో మన్మథుడు, మాస్, కింగ్, ఢమరుఖం వంటి సినిమాలకు DSP సంగీతం అందించి.. నాగ్కి సూపర్ సక్సెస్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే కింగ్ 100 మూవీకి DSP అయితేనే.. అక్కినేని ఫ్యాన్స్ ఆకలి తీర్చుతాడానికి నాగ్ భావించడంతో.. రాక్ స్టార్ ని రంగంలోకి దింపాడని టాక్. ముఖ్యంగా నాగార్జున స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా మాస్‌తో పాటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే సంగీతాన్ని అందించే సామర్థ్యం DSPకే ఉందని నాగార్జున నమ్ముతున్నారని టాక్.
ThaaankU soooooo muchhhhh dearest KING @iamnagarjuna Sirrrrr !!!
— DEVI SRI PRASAD (@ThisIsDSP) August 2, 2026
🎶🎶🙏🏻🙏🏻❤️❤️🤗🤗
Superrrr Excited to be onboard for #KING100
Lets ROCK once again Sirrrrrr
♥️🤗❤️🙏🏻🎵🕺🤘🏻@AnnapurnaStdios https://t.co/SRv4KDWwsp
అందుకే తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రానికి డీఎస్‌పీనే బెస్ట్ ఛాయిస్‌గా భావించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాంబో మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో 'కింగ్ 100' ఆల్బమ్ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందనే అంచనాలు అభిమానుల్లో బలంగా కనిపిస్తున్నాయి.
ALSO READ : మంత్ర తంత్ర విద్యలకు అందని శక్తి..
నాగార్జునను ఢీకొట్టబోతున్న టబు..
నాగార్జున, టబు కాంబినేషన్ అనగానే ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సూపర్ హిట్ మూవీ గుర్తొస్తుంది. సిసింద్రీ, ఆవిడా మా ఆవిడే లాంటి చిత్రాల్లోనూ కలిసి కనిపించిన ఈ జంట.. దాదాపు మూడూ దశాబ్ధాల తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
నాగార్జున కెరీర్‌లో ఇది 100వ సినిమా కావడంతో హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక నాగ్‌కు హిట్ పెయిర్‌గా అలరించిన టబు.. ఈ సినిమాలో మాత్రం పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. నాగార్జున, టబు మధ్య రాబోయే సీన్స్ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా ఉండబోతున్నాయట.
ఇలా నెగెటివ్, డార్క్ షేడ్స్ ఉండే పాత్రల్లో నటించడం టబుకు కొత్తేమీ కాదు. అంధాధూన్, మఖ్బూల్, హైదర్, ఫితూర్ లాంటి సినిమాల్లో గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్స్‌లో తనదైన నటనతో ఆమె మెప్పించారు. ఇక ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రం ఎనభై శాతం వరకూ షూటింగ్ పూర్తయింది.
సీక్రెట్‌గా సాగుతున్న షూటింగ్..
ఇకపోతే, ‘నాగ్ 100’ సినిమా అనగానే.. డైరెక్టర్గా కార్తీక్, విలన్గా టబు అని మాత్రమే ఆడియన్స్కు తెలుసు. మిగతా ఏ విషయాల్లో లీకులు లేవు. షూటింగ్ పూర్తయ్యే వరకు సినిమాకు సంబంధించిన కీలక వివరాలు బయటకు రాకుండా నాగార్జున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ కూడా షూటింగ్ మరియు సినిమా జానర్ గురించి అత్యంత సీక్రెట్ మెయింటేన్ చేస్తూ వస్తుంది.
షూటింగ్ పూర్తయ్యాక భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించాలనే ప్లాన్‌లో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అభిమానులు ఎదురుచూస్తున్న అధికారిక అప్డేట్ త్వరలోనే రానుంది.
