ఇండియాలో చోరీ.. బంగ్లాదేశ్లో అమ్మకం.. ఆదిలాబాద్ జిల్లాలో ముఠా అరెస్టు

ఇండియాలో చోరీ.. బంగ్లాదేశ్లో అమ్మకం.. ఆదిలాబాద్ జిల్లాలో ముఠా అరెస్టు

ఇండియాలో చోరీ చేసి బంగ్లాదేశ్ లో అమ్ముకుంటున్న ముఠాను అరెస్టు చేశారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను దొంగిలించి తమ స్వదేశం అయిన బంగ్లాదేశ్ లో అమ్ముకోవడం అలవాటు చేసుకున్న ముఠాను.. చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సోమవారం (ఆగస్టు 03) ఆదిలాబాద్   ఎస్పీ ఆఖిల్ ‌మహజన్ వివరాలను  మీడియాకు వెళ్లడించారు. 

 అరెస్టైన దొంగలలో  ఇద్దరు  బంగ్లాదేశ్ కు చెందిన వారు ఉన్నారని ఎస్పీ చెప్పారు. ఇక్కడ దొంగతనాలు చేస్తూ..  బంగ్లాదేశ్ లో చోరి సొమ్మును అమ్ముతున్నారని తెలిపారు. కేవలం దొగతనాల కోసమే  ఇండియా వస్తున్నట్లు చెప్పారు. 

ఈ ముఠాలో   పన్నెండు  మంది  సభ్యులు   ఉన్నట్లు తెలిపారు.  మహరాష్ట్ర, మద్య ప్రదేశ్ లలో చోరీలకు పాల్పడిన ముఠా.. తెలంగాణలో కూడా దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ బంగ్లాదేశ్ దొంగలు జైపూర్ లో ఫేక్  ఆధార్ కార్డులు  తీసుకున్నట్లు గుర్తించారు.

ALSO READ : కర్నాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. 

దొంగల నుంచి  పన్నెండు  లక్షల విలువైన నగలను   స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దొంగలు ఆదిలాబాద్ లో రెండు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.