ఆధార్ కార్డు వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది ఆధార్ కార్డులను పౌరసత్వం, నివాసం, అడ్రస్ ధృవీకరణకు ప్రూఫ్ గా వాడుతున్నారని, ఇది కేవలం ఐడెంటిటీ వెరిఫికేషన్ కు మాత్రమే పరిమితం చేయాలని దాఖలైన పిటిషన్ ను విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటను స్పందించాలని సుప్రీంకోర్టు కోరింది.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసం, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ ను విచారించింది. ఈ పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.
ఆధార్‌ను ఐడెంటిటీ ఫ్రూఫ్ గా మాత్రమే వాడాలని పౌరసత్వం, నివాసం, అడ్రస్, పుట్టిన తేదీకి సంబంధించిన రుజువుగా వినియోగించకుండా కేంద్ర, రాష్ట్ర, ఎన్నికల సంఘాలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు పిటిషనర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్.
ఓటరు నమోదుకు బర్త్ డేట్, రెసిడెంట్ ఫ్రూఫ్ లకు ఆధార్ కార్టును వినియోగిస్తున్నారని, ఇది ఆధార చట్టానికి విరుద్దమని పిటిషనర్ వాదించారు. ఆధార్ చట్టం, 2016లోని సెక్షన్ 9 'ఆధార్ పౌరసత్వానికి లేదా రెసిడెంట్ కు ఫ్రూఫ్ కాదని స్పష్టంగా తెలిపింది ఉడాయ్.
అయినప్పటికీ, ఆధార్‌ను స్కూల్ అడ్మిషన్లు,ప్రాపర్టీ కొనుగోలు, బర్త్ ఫ్రూఫ్ రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కోసం వయస్సు, పౌరసత్వం, నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించడమే కాకుండా, కొత్త ఓటరు నమోదుకు, పుట్టిన తేదీకి, నివాస ధృవీకరణ పత్రంగా కూడా వాడుతున్నారు. ఈ విధంగా, చొరబాటుదారులు, అక్రమ వలసదారులు ఆధార్‌ను ఉపయోగించి వివిధ డాక్యుమెంట్లను పొందుతున్నారని పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలలో ధృవీకరణ వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని, సంస్కరణలను పర్యవేక్షించేందుకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు.
