IND W vs NED W: మహిళల T20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ వర్సెస్ భారత్ మధ్య పోరు కొనసాగుతుంది. ఈ మ్యాచులో నెదర్లాండ్స్ కెప్టెన్ బాబెట్ డి లీడ్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తమ బ్యాటింగ్ పవర్‌ను టెస్ట్ చేసుకోవడానికి ఇదొక గ్రేట్ అపార్చునిటీ అని పేర్కొంది.
నెదర్లాండ్స్ కెప్టెన్ బాబెట్ డి లీడ్ మాట్లాడుతూ.. పిచ్ నుంచి బౌలర్లకు కొంత సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నాం, అందుకే మొదట బౌలింగ్ చేసి టార్గెట్‌ను ఛేజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇండియాలాంటి టీమ్‌తో ఆడటం తమకు ఒక కల నిజమవ్వడం లాంటిదని, కాస్త నర్వస్‌గా ఉన్నా మ్యాచ్ కోసం సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నామని పేర్కొంది. ఈ మ్యాచ్ కోసం జట్టులో మార్పు చేసినట్లు పేర్కొన్నారు.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. మొదట బ్యాటింగ్ చేసి తమను తాము ఛాలెంజ్ చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ పవర్‌ప్లేను సరిగ్గా వాడుకోవడంపైనే దృష్టి పెట్టామని, వికెట్‌ను బట్టి వీలైనంత డీప్‌గా బ్యాటింగ్ చేయడమే తమ ప్లాన్ అని హింట్ ఇచ్చింది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది.. పేసర్ అరుంధతి రెడ్డికి రెస్ట్ ఇచ్చి, నందిని శర్మను ప్లేయింగ్ XI లోకి తీసుకువచ్చినట్లు తెలిపింది.
►ALSO READ | భారత్-A మాస్ విక్టరీ: ఆఫ్ఘన్‌పై 101 రన్స్ తేడాతో గెలుపు.. లంకతో బ్లాక్‌బస్టర్ ఫైట్‌కు రెడీ!
ఇరు జట్లు:
భారత మహిళల జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ.
నెదర్లాండ్స్ మహిళల జట్టు: హీథర్ సీగర్స్, ఫేబే మోల్కెన్‌బోయర్, బాబెట్ డి లీడ్ (కెప్టెన్/వికెట్ కీపర్), స్టెర్రే కాలిస్, రాబిన్ రిజ్కే, ఫ్రెడరిక్ ఓవర్‌డిజ్క్, ఐరిస్ జ్విల్లింగ్, మైర్తే వాన్ డెన్ రాడ్, కరోలిన్ డి లాంగే, సిల్వర్ సీగర్స్, ఇసాబెల్ వోనింగ్.
Here's a look at #TeamIndia's Playing XI for our 2️⃣nd match of the #T20WorldCup 🙌
— BCCI Women (@BCCIWomen) June 17, 2026
Updates ▶️ https://t.co/FMkrKB1zcS#WomenInBlue | #INDvNED pic.twitter.com/NwUoSijTqb
