India A vs Afghanistan A: త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు 101 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్-ఏపై ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఫైనల్ బెర్త్‌ను దాదాపు కన్ఫర్మ్ చేసుకుంది. ఇప్పుడు ఆఫ్ఘన్ టీమ్ ఫైనల్ చేరాలంటే శ్రీలంకపై ఊహించని రేంజ్‌లో భారీ మార్జిన్‌తో గెలవాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం సోమవారం జరిగిన గొడవ బ్యాక్‌డ్రాప్‌లో.. ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య బ్లాక్‌బస్టర్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అవుతుంది.
తిలక్, కుషాగ్ర పార్ట్‌నర్‌షిప్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 319 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ మధ్యలో కెప్టెన్ తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రల మధ్య నమోదైన 104 పరుగుల క్రేజీ పార్ట్‌నర్‌షిప్ జట్టుకు గట్టి పునాది వేసింది. తిలక్ వర్మ ఈ సిరీస్‌లో తన మూడో హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కూడా క్లాస్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఒక దశలో భారత్ స్కోరు 350 దాటుతుందనిపించినా.. కుషాగ్ర అవుట్ అయ్యాక ఆఫ్ఘన్ బౌలర్లు మ్యాచ్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చారు. డెత్ ఓవర్లలో సెట్ అయిన బ్యాటర్లు సూర్యాంశ్ శెడ్గే, తిలక్ వర్మలను వరుసగా అవుట్ చేస్తూ టీమిండియాను 319 రన్స్‌కే కట్టడి చేశారు.
►ALSO READ | పాకిస్థాన్‌లోనా ఫిఫా వరల్డ్ కప్?.. పాక్ నేత వ్యాఖ్యలకు నవ్వుకుంటున్న నెటిజన్లు
బహీర్, ఫైసల్ పోరాటం.. సూర్యవంశీ కిరాక్ ఫీల్డింగ్:
320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుకు ఓపెనర్లు ఇమ్రాన్ మీర్, హసన్ ఐసాఖిల్ మంచి స్టార్ట్ ఇచ్చారు. టీమిండియా బౌలర్ యశ్ ఠాకూర్ తన మొదటి ఓవర్లో భారీగా రన్స్ ఇచ్చుకున్నా.. ఆ తర్వాత కోలుకుని డేంజర్ బ్యాటర్ ఐసాఖిల్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత బహీర్ షా, ఫైసల్ షినోజాదాలు 4వ వికెట్‌కు 87 రన్స్ జోడించి ఆఫ్ఘన్ టీమ్‌ను రేసులో నిలిపారు. కానీ మ్యాచ్ ఆఫ్ఘన్ చేతుల్లోకి వెళ్తున్న టైమ్‌లో.. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫీల్డింగ్, అశోక్ శర్మ పట్టిన ఒక సంచలన క్యాచ్ మ్యాచ్‌ను పూర్తిగా ఇండియా వైపు తిప్పేసాయి. మిడిల్ ఓవర్లలో అనుకుల్ రాయ్, విప్రాజ్ నిగమ్‌లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆఫ్ఘన్‌ను దెబ్బకొట్టడంతో భారత్ 101 పరుగుల తేడాతో గెలిచింది.
