Pakistan Hosting FIFA World Cup: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. దానికి వందల కోట్ల బడ్జెట్, ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియాలు, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి.. కానీ, పాకిస్థాన్‌కు గనుక ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు హోస్ట్ చేసే ఛాన్స్ వస్తే.. తమ దేశంలోని ఒక లోకల్ ఏరియా దానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందంటూ పాకిస్థాన్ పొలిటీషియన్ నబిల్ గబోల్ (Nabil Gabol) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి.
లియారీలో వరల్డ్ కప్ మ్యాచులు:
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఉన్న లియారీ (Lyari) అనే ప్రాంతానికి ఫుట్‌బాల్ అంటే విపరీతమైన పిచ్చి.. అక్కడ ఉన్న ఫుట్‌బాల్ కల్చర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి నబిల్ గబోల్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు గనుక ఎప్పుడైనా ఫిఫా వరల్డ్ కప్‌ను హోస్ట్ చేసే ఛాన్స్ వస్తే.. లియారీలో ఒక అద్భుతమైన గ్రౌండ్ ఉంది.. అక్కడ మ్యాచ్‌లు చాలా గ్రాండ్‌గా నిర్వహించవచ్చు.. కానీ కొంతమంది గుడ్డివాళ్లు ఉన్నారు, అందుకే వాళ్లు ఆ గ్రౌండ్‌ను చూడలేకపోతున్నారంటూ గబోల్ విమర్శించారు.
పాకిస్థాన్ మినీ బ్రెజిల్.. వరల్డ్ కప్ వస్తే పూనకాలే:
నబిల్ గబోల్ అన్నట్లుగానే కరాచీలోని లియారీ డిస్ట్రిక్ట్‌కు ఫుట్‌బాల్‌తో ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ యొక్క ఫుట్‌బాల్ హబ్‌గా పిలుస్తారు. ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలు జరుగుతున్నప్పుడు ఇక్కడి వీధులన్నీ రకరకాల దేశాల జెండాలతో, కలర్‌ఫుల్ డెకరేషన్స్‌తో ఐపీఎల్ రేంజ్‌లో మెరిసిపోతాయి. మ్యాచ్‌లు చూసేందుకు వీధుల్లో పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు, వాటిని చూడటానికి వేలాది మంది ఫ్యాన్స్ తరలివచ్చి ఫుల్ రచ్చ లేపుతారు.
ALSO READ : ఒకే ఓవర్లో రెండు సెంచరీలు..
ప్రాక్టికల్లీ ఇంపాజిబుల్ బ్రో:
పొలిటీషియన్ గబోల్ కేవలం తన లోకల్ ఏరియాపై ఉన్న నమ్మకంతో, గర్వంతోనే ఈ కామెంట్స్ చేసినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై పెద్ద డిస్కషన్ నడుస్తోంది. అన్నగారు.. ఫుట్‌బాల్‌పై ప్యాషన్ ఉండటం మంచిదే కానీ, ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు లోకల్ గ్రౌండ్‌లో పెట్టడం ప్రాక్టికల్లీ ఇంపాజిబుల్ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా, ఈ లొల్లి వల్ల పాకిస్థాన్‌లో ఫుట్‌బాల్ గేమ్ గ్రోత్ గురించి మళ్లీ చర్చ స్టార్ట్ అయింది.
