
కరోనా పై పోరులో ఇండియా పేదలకు ప్రాధాన్యమిచ్చిందన్నారు ప్రధాని మోడీ.ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి గరీబ్ కల్యాన్ రోజ్ గార్ యోజన లాంటి పథకాలతో మేలు చేశామన్నారు. మధ్యప్రదేశ్ లోని గరీభ్ కల్యాణ్ అన్న యోజన పథకం లబ్ధిదారులతో మాట్లాడారు మోడీ. మొదటి నుంచి పేదలకు ఆహారం, నిరుద్యోగం పై ఆలోచన చేశామన్నారు. మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో వరదలు వచ్చాయని, దేశమంతా మీ వెంట ఉందన్నారు మోడీ. దాదాపు 80 కోట్ల పౌరులకు సంక్షోభ సమయంలో ఫ్రీ రేషన్ అందించామన్నారు. 8 కోట్ల మందికి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. 20 కోట్ల మహిళల ఖాతాల్లోకి నేరుగా 30 వేల కోట్లు జమ చేశామని చెప్పారు.