జనగామ: ‘సర్’లో 8 వేల డూప్లికేట్ ఓట్లు గుర్తింపు

జనగామ: ‘సర్’లో 8  వేల డూప్లికేట్ ఓట్లు గుర్తింపు

జనగామ, వెలుగు : సర్ 2026 ప్రకియపై జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్ఐఆర్​ఇన్​చార్జి భాస్కర్​ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఎల్ఏలు మాట్లాడుతూ ఇప్పటివరకూ 8 వేల ఓట్లను గుర్తించామని, సర్ ప్రక్రియ పూర్తయ్యేనాటికి డూప్లికేట్, మృతి చెందిన వారివి మరో రెండు వేల ఓట్లు గుర్తించే అవకాశముందని తెలిపారు. సర్ ప్రక్రియలో బీఎల్​వోలు పూర్తిగా వైఫల్యం చెందారని వివరించారు. 

ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్​ ఫారాలను కొందరు బీఎల్​వోలు తిరిగి తీసుకెళ్లడం లేదన్నారు. తీసుకెళ్లిన ఫారాలను డిజిటలైజేషన్​ చేయడం లేదని, తామే వాటిని చేస్తున్నామని బీఎల్ఏలు వివరించారు. కాంగ్రెస్​ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్​చార్జి మాట్లాడుతూ హైదరాబాద్​లో నివాసం ఉంటూ ఇక్కడే ఓటర్లుగా ఉండాలనుకునే వారి అడ్రస్​లు సేకరించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు.