తొలిరోజు టీజీ పీజీఈసెట్ కు 88 శాతం హాజరు

తొలిరోజు టీజీ పీజీఈసెట్ కు 88 శాతం హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ పీజీఈసెట్- శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు 88 శాతం మంది హాజరయ్యారు. కాగా, మార్నింగ్ సెషల్​లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు జరిగాయి. మొత్తం 3,539 మంది విద్యార్థులకు గానూ 3,084 మంది(87.14 శాతం) అటెండ్​అయ్యారు.

మధ్యాహ్నం సెషన్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షను10,045 మందికి గానూ 8,972 మంది(89.32 శాతం) రాశారు. హైదరాబాద్‌‌‌‌, వరంగల్ సెంటర్లలో పరీక్షలు సజావుగా జరిగాయని పీజీఈసెట్ కన్వీనర్ వెంకటేశ్వర్​రావు తెలిపారు. పరీక్షలను టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రెక్టార్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి తదితరులు పర్యవేక్షించారు.