OLXలో మోసాలు: 9 మంది అరెస్ట్

OLXలో మోసాలు: 9 మంది అరెస్ట్

హైదరాబాద్ : OLXలో మోసాలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. టూవీలర్, ఫోర్ వీలర్, కెమెరాలు తక్కువ ధరకే అమ్ముతామంటూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. కొంత కాలంగా OLXలో వాహనాల నకిలీ ఫోటోలు పెడుతూ… పలువురిని మోసం చేస్తున్నట్లు చెప్పారు. OLX లో ఫోటోలు పెట్టి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటున్నారని గుర్తించారు. వీరంతా రాజస్థాన్ భరత్ పూర్ కు చెందిన వారిగా గుర్తించారు.