3 నెలల్లో ఒక్క గాంధీలోనే 905 మంది మృతి

3 నెలల్లో ఒక్క గాంధీలోనే 905 మంది మృతి

ఉస్మానియా, చెస్ట్ హాస్పిటల్, కింగ్ కోఠి, జిల్లా దవాఖాన్లలోనూ మృతులు
అవన్నీ కలిపితే ఇప్పటిదాకా వెయ్యికిపైగానే కరోనామరణాలసంఖ్య
కేవలం 471 మందేచనిపోయినట్టు ఆరోగ్యశాఖబులెటిన్
వేరే జబ్బులుంటే కరోనామరణాల్లో చేర్చబోమన్న మంత్రిఈటల
ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కారమే చేస్తున్నామని వాదన
వాటినీ లిస్ట్ లో చేర్చాలన్న ఐసీఎంఆర్..ఫార్మాట్ కూడా ఇచ్చిన సంస్థ‌

హైదరాబాద్, వెలుగు:‘‘ఎప్పటి నుంచో జబ్బులున్నోళ్లు కరోనా బారిన పడి చనిపోతే.. ఆ మరణాలను కరోనా లెక్కల్లో చేర్చేది లేదు’’ ఇదీ శనివారం ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన కామెంట్. ఆయన కామెంట్ ఎలా ఉన్నా.. బులెటిన్ లో చూపిస్తున్నలెక్కకు, ఆస్పత్రుల్లో చనిపోతున్న వారి లెక్కకు అసలు పొంతన కుదరట్లేదు. శ్మశానాల్లో కాలుతున్న శవాలు, ఆస్పత్రుల్లోని రికార్డులు అసలు నిజాలను బయటపెడుతున్నాయి. ఇప్పటిదాకా 471 మందే కరోనాతో చనిపోయారని బులెటిన్లో ఆరోగ్య శాఖ ప్రకటించింది. కానీ, ఈ మూడు నెలల్లో కొవిడ్ స్పెషల్ హాస్పిటల్ గా ప్రకటించిన ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 905 మంది చనిపోయారు. మేలో 189, జూన్లో 344, జులైలో 369 మంది చనిపోయినట్టు ఆస్పత్రి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

ఏప్రిల్లోనే గాంధీని కొవిడ్ స్పెషల్ హాస్పిటల్గా ప్రకటించింది సర్కార్. అప్పటి నుంచి కరోనా పేషెంట్లను మాత్రమే ఆస్ప త్రిలో చేర్పించుకుంటున్నారు. దీని ప్రకారం మే నుంచి జులై వరకు గాంధీలో చనిపోయినోళ్లంతా కరోనా వల్ల ఆరోగ్యం ఖరాబైన వాళ్లేన‌ని డాక్ట‌ర్లు అంగీకరిస్తున్నారు. ఇటు ఉస్మానియా ఆస్పత్రిలో 3 నెలల్లో 1,718 మంది చనిపోతే.. అందులో 300 మంది దాకా శ్వాస సమస్యలతోనే చనిపోయారని డాక్టర్లు అంటున్నారు. వాటికి తోడు హైదరాబాద్లోని చెస్ట్ హాస్పిటల్, కింగ్ కోఠి హాస్పిటల్, 30కిపైగా ప్రైవేట్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో నమోదైన మరణాలు అదనం. ఈ లెక్కన కరోనాతో మూడు నెలల్లో వెయ్యి మందికి పైగానే చనిపో యినట్టు అర్ద‌మవుతోంది. కానీ, సర్కార్ మాత్రం నిజాలను దాచేసి బులెటిన్లో మరణాల సంఖ్యను తక్కువ చూపిస్తోంది. కేసుల విషయం
లోనూ అదే జరుగుతోంది.

ఐసీఎంఆర్ చెప్పిందంటూ…

మరణాల లెక్కలను తప్పుగా చూపిస్తున్న సర్కార్ .. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సూచనల మేరకే కరోనా మరణాలను రికార్డుల్లో నమోదు చేస్తున్నామని అంటోంది. వేరే జబ్బులున్నోళ్లు కరోనా బారిన పడి చనిపోతే కరోనా లెక్కల్లో చేర్చొద్దని ఐసీఎంఆర్ చెప్పిందంటూ మే 16న మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రెండ్రోజుల క్రితం కామారెడ్డి లోనూ ఇదే మాటన్నారు. కానీ, ఐసీఎంఆర్ అలా చెప్పనేలేదు. కరోనా మరణాల లెక్కలపై మే 10న ఐసీఎంఆర్ గైడ్ లైన్స్
ఇచ్చింది. కరోనాతో చనిపో యిన వాళ్ల‌కు వేరే జబ్బులున్నా వాటినీ కరోనా లెక్కల్లోనే చేర్చాలని స్పష్టంగా ఐసీఎంఆర్ చెప్పింది. వాటికి డబ్ల్యూహెచ్ వో సూచించిన కోడ్లను కూడా సూచించింది. మరణాల లెక్కల్లో పారదర్శకతతోనే వైరస్ ప్రభావం అంచనా వేయొచ్చని సూచించింది. మన సర్కార్ మాత్రం వేరే జబ్బులుండి చనిపోయినోళ్లను కరోనా లెక్కల్లో చేర్చబోమంటోంది.

మంత్రులతలోమాట..

కరోనా మరణాల విషయంలో మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే .. చావులు కోరుతున్నారా అంటూ వాదనకు దిగుతున్నారు. మరణాలను దాచి పెట్టడం లేదని ఒకసారి.. కరోనాతో మరణించిన వాళ్లంతా కరోనాతో చనిపోయినట్టు కాదని మరోసారి చెబుతూ అయోమయానికి గురి చేస్తున్నారు. కేసుల సంఖ్యలోనూ సర్కారుది అదే ధోరణి. కేసులు 90 వేలకు చేరితే సర్కారు మాత్రం 55 వేల దగ్గరే ఉంది. 35 వేల కేసులను దాచేసింది.

కరోనా వార్డులో వాటర్ లీకేజ్

పద్మారావునగర్, వెలుగు: కరోనా మోడల్ సెంటర్ గాంధీ ఆసుపత్రిలో నిర్ల‌క్ష్యం కొనసాగుతూనే ఉంది. సోమవారం రాత్రి ఏడో ఫ్లోర్ ‘బి’ వింగ్ కరోనా వార్డు బాత్రూమ్ నుంచి నీళ్లుభారీగా లీక్‌ కావడంతో వార్డు మొత్తం నీళ్లు నిండాయి. పేషెంట్లు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది, నర్సులు వార్డు వైపే రాలేదని వారు వాపోయారు. తమను సరిగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ..