ఇది నిజం : తెలంగాణలో మొదలైన పోలింగ్.. ఖైరతాబాద్ నుంచి తొలి ఓటు

ఇది నిజం : తెలంగాణలో మొదలైన పోలింగ్.. ఖైరతాబాద్ నుంచి తొలి ఓటు

తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ మొదలైపోయింది.. తొలి ఓటు పడింది.. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా.. అవును ఇది నిజం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 21వ తేదీ నుంచే పోలింగ్ మొదలైపోయింది. 91 సంవత్సరాల వృద్ధురాలు తన ఓటు వేయటం ద్వారా.. పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో. . ఈ ఓటు వేశారు. ఓటు వేసింది ఎవరో తెలుసా చుండూరి అన్నపూర్ణ అనే 91 ఏళ్ల వృద్ధురాలు.. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఈ ఓటు పడింది. 

పోలింగ్ 30వ తేదీ కదా.. 21వ తేదీ ఓటు వేయటం ఏంటీ అని అనుకుంటున్నారా.. ఆరు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇంటికే వెళ్లి ఓటు వేయించుకోవటం.. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. ఇలాంటి ఓటు వినియోగించుకోవాలి అంటే.. ఫాం 12డి అప్లయ్ చేసుకోవాలి. ఇందులో అడ్రస్ ఆధారంగా పోలింగ్ అధికారులే ఇంటికి వచ్చి బ్యాలెట్ ద్వారా ఓటు వేయించుకుని వెళతారు. ఈ అవకాశం నవంబర్ 27వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఓట్లు వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఓవరాల్ గా తెలంగాణలో పోలింగ్ మొదలైపోయింది.. తొలి ఓటు పడింది.. అది ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి.. రాబోయే నాలుగైదు రోజుల్లో ఇంటింటికీ వెళ్లి వేయించుకునే ఓట్లు ఎన్ని ఉంటాయో చూడాలి.. పార్టీలు సైతం ఇప్పటికే పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెట్టాయి అనటానికి ఇదే కారణం..