
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్, మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్పద్ధతిలో122 మెడికల్ పోస్టుల భర్తీకి శనివారం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డీఆర్ఓ వెంకటాచారి, గాంధీ హాస్పిటల్సూపరింటెండెంట్డా.రాజారావు, కాలేజీ ప్రిన్సిపాల్ కె.రమేశ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ డా.రవీందర్ కుమార్, డా.మోహన్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. గాంధీ హాస్పిటల్, మెడికల్ కాలేజీలోని 22 డిపార్ట్ మెంట్లలో 3 ప్రొఫెసర్లు, 74 అసిస్టెంట్ప్రొఫెసర్లు, 37 సీనియర్ రెసిడెంట్లు, 8 ట్యూటర్ల పోస్టులు కలిపి మొత్తం 122 ఖాళీలు ఉన్నాయి. శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలలో మొత్తం 96 మందిని సెలెక్ట్ చేశారు. వచ్చే ఏడాది మార్చి31 వరకు వీరంతా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తారు.