కేపీఎంజీలో 9 వేల ఉద్యోగాలు

కేపీఎంజీలో 9 వేల ఉద్యోగాలు

న్యూఢిల్లీ : గ్లో బల్‌ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ భారత్‌ లో వర్క్‌ ఫోర్స్‌‌‌‌ను పెంచబోతుంది. దాదాపు 9000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్‌ చేస్తోంది. వారిలో 10 శాతం మంది ఉద్యోగులు విదేశాలలోని తమ కార్యాలయాలలో పనిచేయనున్నారని తెలిపింది. ఇండియాలోనూ, గ్లో బల్‌ గానూ కన్సల్టిం గ్‌ రంగంలో పెద్ద మార్పుకు ఈ కెపిఎంజి తాజా నిర్ణయం సంకేతాలిచ్చినట్లవుతుంది. కేపీఎంజీ ఇండియా సంస్థను 1993 సెప్టెం బర్‌‌‌‌లో ప్రారంభించారు. ఫైనాన్సి యల్‌ , బిజినెస్‌ డ్వయిజరీ, ట్యాక్స్‌‌‌‌,రెగ్యులేటరీ, రిస్క్‌ అడ్వయిజరీ సర్వీసెస్‌ ను కెపిఎంజి ఆఫర్‌‌‌‌ చేస్తోంది. ప్రస్తుతం భారత్‌ లో తన గ్లో బల్‌ డెలివరీ క్యాపబిలిటీని పెంచుకునే ప్రయత్నం లో వుం ది.