గాదె సాయికృష్ణ ఘటనపై సీబీఐ ఎంక్వైరీ జరగాలి : వైఎస్ జగన్

గాదె సాయికృష్ణ ఘటనపై సీబీఐ ఎంక్వైరీ జరగాలి : వైఎస్ జగన్

ఏపీలోని విజయవాడలో గాదె సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ( జూన్ 18 ) వైసీపీ అధినేత జగన్ గాదె సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. గాదె సాయికృష్ణ ఘటనపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు జగన్.

ఈ ఘటనలో ఏసీపీ, సీపీ సహా అందరి పాత్ర తేలాలని అన్నారు జగన్. సీఐ సస్పెన్షన్ అనేది కేవలం కంటితుడుపు చర్య అని అన్నారు. సీఐని అరెస్ట్ చేయకుండా సాయి తల్లితో బేరసారాలు ఆడతారా అని మండిపడ్డారు జగన్. 

►ALSO READ | ఈసారి కార్యకర్తలను బాగా చూసుకుంటా: వైఎస్ జగన్ 

పోలీసులు, జనసేన లీడర్లు సాయి తల్లిని ప్రలోభపెడుతున్నారని అన్నారు జగన్. ఒక సీఐ స్టేషన్ పరిధిలో నెలలోనే రెండు చావులు నమోదవ్వడం దారుణమని అన్నారు జగన్.