ఏఐ ఇన్వెస్ట్మెంట్లకు 99 శాతం కంపెనీలు రెడీ

ఏఐ ఇన్వెస్ట్మెంట్లకు 99 శాతం కంపెనీలు రెడీ

హైదరాబాద్​, వెలుగు: మనదేశంలోని 99 శాతం సంస్థలు రాబోయే ఏడాదిలో ఏఐ పెట్టుబడులను పెంచాలని నిర్ణయించుకున్నాయి.  ఏఐ బడ్జెట్ వార్షికంగా 19 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. లెనోవో సీఐఓ ప్లేబుక్ 2026 రిపోర్ట్​ ప్రకారం.. దాదాపు 96 శాతం సంస్థలు తమ ఏఐ ఖర్చులను 15 శాతం పెంచాలని భావిస్తున్నాయి. ఇవి ఏఐ మౌలిక సదుపాయాలు, శిక్షణ, జెన్ ఏఐ అభివృద్ధిపై ఉండనున్నాయి. 

ఆసియా–పసిఫిక్​లోని 88 శాతం సంస్థలు ఏఐ ద్వారా ఒక్కో డాలర్ పెట్టుబడికి 2.85 డాలర్ల  లాభం వస్తుందని భావిస్తున్నాయి. భారత్​లోని 90 శాతం సంస్థలు సెక్యూరిటీ, పనితీరు కోసం హైబ్రిడ్ ఏఐ విధానాన్ని ఇష్టపడుతున్నాయి. ఏజెంటిక్ ఏఐపై ఆసక్తి  పెరుగుతున్నా, ప్రస్తుతం 10 శాతం సంస్థలు మాత్రమే పూర్తిస్థాయి అమలుకు సిద్ధంగా ఉన్నాయి.

59 శాతం సంస్థలు ఇప్పటికే ఏఐని వినియోగిస్తుండగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడం ఐటీ రంగంలో రెండో అతిపెద్ద ప్రాధాన్యతగా మారింది. ఇందుకోసం ఏఐ పీసీల కొనుగోళ్లు పెరుగుతాయని లెనోవో పేర్కొంది.