కౌన్ బనేగా కరోడ్‌పతిలో అప్పుడప్పుడు క్రికెట్ పై ప్రశ్నలు రావడం సహజం. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు క్రికెట్ ప్రేమికులు చాలా అలవోకగా సమాధానం చెప్పేస్తారు. కానీ హాట్ సీట్ లో కూర్చున్న కంటెస్టెంట్ సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. హోస్ట్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న 17 వ సీజన్ గ్రాండ్ గా దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా ఒక క్రికెట్ లో ఏకంగా రూ. 7 కోట్ల 50 లక్షలకు క్రికెట్ కు సంబంధించిన ప్రశ్న అడగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారత మహిళా క్రికెట్ కు సంబంధించి ఈ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం.
2024 లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు అనే ప్రశ్న అడిగారు. దీనికి సంబంధించిన నాలుగు ఆప్షన్స్ ఆమెకు ఇచ్చారు. ఆప్షన్ ఏ జెమీమా రోడ్రిగ్స్.. ఆప్షన్ బి షెఫాలీ వర్మ.. ఆప్షన్ సి హర్మన్ ప్రీత్ కౌర్.. ఆప్షన్ డి స్మృతి మందాన. వీటిలో సరైన సమాధానం ఆప్షన్ డి స్మృతి మందాన. స్మృతి మంధాన 2024 లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా 2025 లో ఆమెకు ఇటీవల విజ్డెన్ లీడింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డును గెలుచుకుంది.
2024 లో స్మృతి మందాన మూడు ఫార్మాట్ లలో అద్భుతంగా రాణించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి ఏకంగా 1,659 పరుగులు చేసింది. వీటిలో నాలుగు వన్డే సెంచరీలు ఉన్నాయి. 2018లో తొలిసారి ఈ అవార్డును గెలుచుకున్న ఈ టీమిండియా ఓపెనర్.. రెండుసార్లు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచింది. టీ20 క్రికెట్ లో అత్యధికంగా 763 పరుగులు చేసిన మందాన.. వన్డేల్లో 747 పరుగులు చేసింది. ఓవరాల్ గా 2024 లో భారత జట్టు చేసిన మొత్తం పరుగుల్లో (6739) మంధాన దాదాపు పావు వంతు పరుగులు చేయడం విశేషం.
