అమ్మ గెలుపు కోసం ..లండన్ నుంచి వచ్చిన కూతురు

అమ్మ గెలుపు కోసం ..లండన్ నుంచి వచ్చిన కూతురు

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుంకెనపల్లి మాధురి లండన్​లో స్థిరపడింది. మున్సిపల్​ఎన్నికల్లో భాగంగా ఆమె తల్లి కొక్కుల శ్రీలత కేదారీశ్వర్ జమ్మికుంటలోని 20వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో తల్లి గెలవాలని ప్రచారం చేసేందుకు మాధురి తన 8 నెలల పాపతో లండన్​నుంచి జమ్మికుంటకు చేరుకుంది. ప్రచారం చేయడంతోపాటు బుధవారం తల్లిదండ్రులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకుంది.