కరీంనగర్ జిల్లాలో రెండు ఓట్ల తేడా.. మూడుసార్లు రీకౌంటింగ్

కరీంనగర్ జిల్లాలో రెండు ఓట్ల తేడా.. మూడుసార్లు రీకౌంటింగ్

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్​ 59వ డివిజన్‌‌‌‌లో ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​అభ్యర్థి బాలసాని తిరుపతిగౌడ్​ రెండు ఓట్ల మెజార్టీతోనే విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఖాజా సనాకు 768 ఓట్లు రాగా, తిరుపతికి 770 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఖాజా సనా చేసిన విజ్ఞప్తికి రీ కౌంటింగ్​ చేశారు. అయినా మళ్లీ రెండు ఓట్ల తేడా వచ్చింది. అయినా మొత్తం మూడు సార్లు కౌంటింగ్​ చేసి చివరకు తిరుపతి గౌడ్​ గెలిచినట్టు రిటర్నింగ్​ ఆఫీసర్​ప్రకటించారు. 

అలాగే రామగుండం కార్పొరేషన్​ 8వ డివిజన్​ నుంచి ఆల్​ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​ అభ్యర్థి పర్లపల్లి పుష్పలీల నాలుగు ఓట్ల తేడాతో గెలిచారు. ఆమెకు 954 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి శనిగరపు శారద(కాంగ్రెస్)కు 950 ఓట్లు వచ్చాయి. రామగుండం కార్పొరేషన్‌‌‌‌ ఎన్నికల్లో 38వ డివిజన్​ నుంచి నెలకంటి రాము(కాంగ్రెస్) అత్యధికంగా 1,048 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాముకు 1720 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి హర్షవర్ధన్‌‌‌‌కు 672 ఓట్లు మాత్రమే వచ్చాయి.