- మొదట ఓ కారును ఢీకొట్టిన మందుబాబు
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలో ఓ యువకుడు మద్యం మత్తులో బెంజ్ కారుతో బీభత్సం సృష్టించాడు. నార్సింగికి చెందిన గుర్రంపాటి తరుణ్ (24) ఆదివారం ఉదయం నానక్రామ్గూడ వద్ద తన బెంజ్ కారుతో మరో కారును వెనుక నుంచి ఢీకొట్టాడు.
ప్రమాదాన్ని గమనించిన అక్కడి ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు వాహనాన్ని ఆపబోగా, నిందితుడు ఆగకుండా అలాగే దూసుకెళ్లాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణరక్షణ కోసం కారు బోనెట్పైకి ఎక్కగా, అయినా వాహనం ఆపలేదు. సుమారు కొంతదూరం వరకు జిగ్-జాగ్ రీతిలో నడుపుతూ ప్రమాదకరంగా వెళ్లాడు.
దీంతో స్థానికులు అడ్డుకొని కానిస్టేబుల్ను కాపాడారు. నిందితుడికి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా, రక్తంలో 160 ఎంజీ ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. దీంతో నిందితుడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
