సినీ పరిశ్రమలో వేధింపులపై బహిరంగ విచారణ

సినీ పరిశ్రమలో వేధింపులపై బహిరంగ విచారణ

కమిటీ తొలి సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: సీనీ, టీవీ పరిశ్రమలో లైంగిక వేధింపుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం చైర్మన్ రామ్మోహన్ రావు అధ్యక్షతన హైదరాబాద్ లోని ఎఫ్ డీసీ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్ , సీనీ పరిశ్రమ నుంచి సుప్రియ, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రీతినిగమ్, దర్శకురాలు నందినీరెడ్డి, గాంధీ హాస్పిటల్  ప్రొఫెసర్ రమాదేవి, నల్సార్ వర్సిటీ ప్రొఫెసర్ వాసంతి, కార్మిక శాఖ జాయిం ట్ కమిషనర్ గంగాధర్ సమావేశానికి హాజరయ్యారు. పరిశ్రమల్లో వేధింపులపై త్వరలోనే బహిరంగ విచారణ చేపట్టాలని నిర్ణయిం చినట్లు తెలుస్తోంది. కమిటీలో లేని సినీ నిర్మాత జీవిత రాజశేఖర్ హాజరవటం పట్ల కమిటీ సభ్యులు పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.