సమంతకి గుడి కట్టిస్తున్న వీరాభిమాని

సమంతకి గుడి కట్టిస్తున్న వీరాభిమాని

సమంతపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు ఓ వీరాభిమాని. సామ్‌ కోసం ఏకంగా తన ఇంటిని గుడిగా మార్చేశాడు. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్‌ అనే వ్యక్తికి సమంత అంటే చాలా ఇష్టం. ఆమె అన్న, ఆమె సినిమాలన్నా పడి చచ్చిపోతాడు. అంతలా ఇష్టపడే తన అభిమాన తార మయోసైటిట్‌ బారిన పడిందని తెలిసి చాలా బాధపడ్డాడట సందీప్‌.

సమంత ఆ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని తిరుపతి, చెన్నై, నాగపట్నం మీదుగా మొక్కుబడి యాత్ర కూడా చేశాడు. ఇలా సామ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న సందీప్‌..  ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. సమంతకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అదికూడా ఎక్కడో కాదు తన ఇంట్లోనే. ఏప్రిల్‌ 28 సమంత పుట్టిన రోజు సందర్భంగా  ఈ గుడిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు.

అయితే ఇలా తమ అభిమాన స్టార్స్ కి గుడి కట్టడం అనేది కొత్త విషయం ఏమి కాదు. గతంలో తమిళ హీరోయిన్ ఖుష్బూ, నిధి అగర్వాల్‌లకు కూడా తమ అభిమానులు ఇలానే ఆలయాలు నిర్మించారు. ఇప్పుడు ఆ లిస్టులో సమంత కూడా చేరిపోయింది. అయితే.. అభిమానం అనేది ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి కానీ.. మరీ ఇలా  గుళ్ళు కట్టించడం కొంచం ఓవర్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.