
న్యూయార్క్ : జంతువులను తరలించే ఓ విమానం గాలిలో ఉండగా విచిత్ర ఘటన చోటుచేసుకుంది. బోనులో బంధించిన ఓ గుర్రం సడెన్ గా బయటకు వచ్చి ఫ్లైట్ లో హల్ చల్ చేసింది. చార్టర్ ఎయిర్‌లైన్ ఎయిర్ అట్లాంటా ఐస్‌లాండిక్ కు చెందిన కార్గో ఫ్లైట్ లో గత గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బెల్జియంకు బోయింగ్ 747 విమానం బయలుదేరింది.
అందులో క్రేట్( బోను లాంటి నిర్మాణం) ఏర్పాటు చేసి గుర్రాన్ని ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన 30 నిమిషాల్లో దాదాపు 31 వేల అడుగుల ఎత్తుకు చేరుకుని ప్రయాణిస్తోంది. అంతలో విమానంలోని బోను నుంచి హఠాత్తుగా గుర్రం బయటకు వచ్చేసింది. విమానంలో తిరగటం ప్రారంభించింది. దాంతో సిబ్బంది భయపడిపోయారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు సమాచారం అందించారు. విమానాన్ని మళ్లీ న్యూయార్క్‌లోనే ల్యాండ్ చేయాలని నిర్ణయించారు.
ఫ్లైట్ బరువును తగ్గించేందుకు 20 టన్నుల ఇంధనాన్ని అరేబియా సముద్రంలో డంప్ చేశారు. గుర్రాన్ని సిబ్బంది కంట్రోల్ చేయగా.. విమానాన్ని పైలెట్ న్యూయార్క్‌లో సేఫ్ గా ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. గుర్రానికి కొన్ని గాయాలయ్యాయి.