వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయ పరిసరాల్లో శనివారం 8 అడుగుల పొడవైన నాగు పాము ప్రత్యక్షమైంది. ఆలయ ముందుభాగంలో బెల్లం దుకాణం సమీపంలో నాగుపాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ జగదీశ్ పామును చాకచక్యంగా పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతండగా నిత్యం నాగు పాములు ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పటికే వందలాది పాములు ఆలయ పరిసరాల్లో సంచరించాయి.
