
హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టైర్ల గోదాంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. చాదర్‌ఘాట్ నుంచి అఫ్జల్‌గంజ్ వెళ్లే రోడ్డులో ఉన్న ఈ టైర్ల గోదాంలో భారీగా మంటలు వస్తున్నాయి. ఈ గోదాం పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కువ సంఖ్యలో టైర్లకు మంటలంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటన తీవ్రత ఎక్కువగా ఉండటంతో 15 ఫైరింజన్లు ప్రమాదస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారు. అగ్నిప్రమాదంతో చాదర్‌ఘాట్-అఫ్జల్‌గంజ్ దారిలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆ రూట్‌లో వెళ్లేవాళ్లు మరో రోడ్‌లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.